కమల్ హాసన్-చిరంజీవి కాంబో.!
- August 12, 2023
మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ ప్రఖ్యాతి దక్కించుకుంది మల్టీ స్టారర్ లిస్టులో ఈ మధ్య. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని మల్టీ స్టారర్లు రూపొందించేందుకు క్రియేటివ్ డైరెక్టర్లు స్ర్కిప్ట్ సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే చిరంజీవి, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీ స్టారర్‌ని ప్లాన్ చేసేందుకు బడా నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారట. ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఈ ముగ్గురు స్టార్ హీరోలూ ప్రస్తుతం తమ తమ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా చిరంజీవి, రజనీకాంత్.. పోటా పోటీగా ‘భోళా శంకర్’, ‘జైలర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
‘విక్రమ్’తో రికార్డులు కొల్లగొట్టిన కమల్ హాషన్ త్వరలో ‘ఇండియన్ 2’ సినిమాతో రాబోతున్నారు. చూడాలి మరి, ఈ బిగ్ మల్టీ స్టారర్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







