సినీ నటుడు తనీష్ తండ్రి కన్నుమూశారు..
- May 17, 2016
వర్ధమాన సినీ నటుడు తనీష్ తండ్రి వర్ధన్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం వేకువజామున కన్నుమూశారు. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వర్ధన్ 6వ అంతస్తు నుంచి మంగళవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నేటి వేకువజామున ఆయన మృతిచెందారు.
ప్రమాదవశాత్తూ వర్ధన్ మృతిచెందడంతో తనీష్, ఆయన కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో ఉన్నారు. దేవుళ్లు, మన్మధుడు సినిమాలలో బాలనటుడిగా నటించిన తనీష్ నచ్చావులే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచమమైన విషయం తెలిసిందే. వర్ధన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రమాదవశాత్తూ జారి పడలేదని ఆత్మహత్యాయత్నం చేశారని భిన్న కథనాలు వినిసిస్తున్నాయి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







