3 నెలల విజిట్ వీసాకు పెరుగుతున్న డిమాండ్..!
- August 18, 2023
యూఏఈ: యూఏఈకి చాలా మంది సందర్శకులు మూడు నెలల సందర్శన వీసాపై వచ్చేందుకు దరఖాస్తు చేస్తున్నారని, రోజుకు 20 మంది వరకు దరఖాస్తు చేసుకుంటున్నారని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ధర వ్యత్యాసం కారణంగా చాలా మంది ఇప్పటికీ 30 లేదా 60 రోజుల వీసాను ఇష్టపడుతున్నారని, 60 రోజుల సందర్శన వీసా Dh650కి అందుబాటులో ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి సమయంలో మూడు నెలల వీసాను యూఏఈ నిలిపివేసింది. ఆ స్థానంలో 60 రోజుల వీసాను తీసుకొచ్చింది. తిరిగి మే 2023 చివరిలో మూడు నెలల వీసాను పునర్ ప్రారంభించిందని తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్ LLC వ్యవస్థాపకుడు, CEO ఫిరోజ్ మలియక్కల్ తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకునే సందర్శకులు, యూఏఈలో ఎక్కువ కాలం సెలవులు గడపాలనుకునే పర్యాటకులు, యూఏఈ నివాసితుల తల్లిదండ్రులు/ పిల్లలు/కుటుంబ సభ్యులు, దేశంలో స్థిరపడాలనుకునే సందర్శకులు 90 రోజుల వీసాకు ప్రధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూడు నెలల వీసాలు రెండు కేటగిరీలుగా ఉంటాయి. 1,000 దిర్హామ్‌ల డిపాజిట్ చేయడం ద్వారా నివాసి కుటుంబ సభ్యులు,స్నేహితులను స్పాన్సర్ చేయవచ్చు. స్పాన్సర్ కనీస జీతం 6,000 నుండి 8,000 వరకు ఉండాలి. రెండవ వర్గం వారి స్పాన్సర్‌గా ట్రావెల్ ఏజెంట్ ఉండవచ్చు. పాస్‌పోర్ట్ కాపీ, ఫోటోలు మాత్రమే అవసరం అవుతాయి. మొదటి కేటగిరీ వీసాల కోసం, వీసా ధర దాదాపు Dh800- Dh1,000 తిరిగి చెల్లించదగిన డిపాజిట్‌తో ఉంటుంది. అధికారిక ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. రెండవ కేటగిరీ కోసం, ప్రజలు తమ ట్రావెల్ ఏజెంట్ ద్వారా Dh 1,200 నుండి Dh1,400 వరకు ధరతో దరఖాస్తు చేసుకోవచ్చు అని లగ్జరీ ట్రావెల్స్‌లో వీసా కన్సల్టెంట్ అయిన పవన్ పూజారి వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









