బిజినెస్ గ్లోబల్ హబ్‌గా బహ్రెయిన్: ప్రిన్స్ సల్మాన్
- August 18, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ తన సేవల నాణ్యత, సామర్థ్యాన్ని నిరంతరం పెంపొందించడానికి కట్టుబడి ఉందని, గ్లోబల్ మరియు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో వ్యాపార కేంద్రంగా బహ్రెయిన్ మారుతుందని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తెలిపారు. పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ సల్మాన్‌కు మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు, కొత్తగా అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ వాణిజ్య రిజిస్ట్రేషన్ పోర్టల్ “సిజిలాట్ 3.0” గురించి అధికారులు వివరించారు. అప్‌డేట్ చేయబడిన సిజిలాట్ 3.0 సిస్టమ్ పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ అందించే సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఇది పెట్టుబడిదారులు తమ వ్యాపారాలను ఏ ప్రదేశం నుండి అయినా సజావుగా నిర్వహించడానికి వీలు కల్పించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన 2030 లక్ష్యాలకు అనుగుణంగా సిజిలాట్ 3.0 ను రూపొందించిన నిపుణుల బృందాన్ని ప్రిన్స్ సల్మాన్ అభినందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







