సౌదీ-ఇరాన్ సంబంధాల్లో కీలక ముందడుగు..!

- August 18, 2023 , by Maagulf
సౌదీ-ఇరాన్ సంబంధాల్లో కీలక ముందడుగు..!

రియాద్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే దిశగా సౌదీ అరేబియా అడుగులు వేస్తుంది. ఇరు దేశాల మధ్య ఒప్పందాలను కుదుర్చుకునే మార్గాలపై చర్చించడానికి సౌదీ అరేబియా ఆసక్తిగా ఉందని విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ స్పష్టం చేశారు. గురువారం రియాద్‌లో తన ఇరాన్ కౌంటర్ హోస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఫర్హాన్ ప్రసంగించారు. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ ప్రాంతీయ భద్రతకు కీలకమైన ఘట్టంగా తెలిపారు. రియాద్‌కు అమీర్-అబ్దుల్లాహియాన్ సందర్శన రియాద్ - టెహ్రాన్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణను తెలియజేస్తోందన్నారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న భద్రత, ఆర్థిక ఒప్పందాలను అమల్లోకి తెచ్చేందుకు ఆసక్తిగా ఎదరుచూస్తున్నట్లు  ప్రిన్స్ ఫైసల్ అన్నారు. వరల్డ్ ఎక్స్‌పో 2030కి ఆతిథ్యం ఇవ్వడానికి కింగ్‌డమ్ బిడ్‌కు మద్దతు ఇచ్చినందుకు ఇరాన్‌కు సౌదీ అరేబియా తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.   

సౌదీ అరేబియాతో సంబంధాలు సరైన దిశలో పయనిస్తున్నాయని, ఆ రాజ్యంతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని తమ దేశం కృతనిశ్చయంతో ఉందని అమీర్-అబ్దుల్లాహియాన్ చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ త్వరలో సౌదీ అరేబియాను సందర్శించనున్నట్లు ఆయన తెలిపారు.   

సౌదీ అరేబియా 2016లో టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయం, మషాద్‌లోని కాన్సులేట్‌పై దాడి తర్వాత ఇరాన్‌తో సంబంధాలను తెంచుకుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com