సినిమా
- June 24, 2015
సినిమా ... ఇది కళాకారులతో నిండిన పరిశ్రమ. ఇది జీవితంలో ఊహించిన, ఊహించని, ఊహకు అందని సహజ, అసాధ్య కార్యకలాపాలను, నవరసాలను కళాకారుల సహాయంతో, సాంకేతిక నైపుణ్యంతో వెండితెరపైకి తీసుకువచ్చే వేదిక. పసిపిల్లల దగ్గరనుండి, వయసుతో సంబంధం లేకుండా అందరినీ అలరించగలదు. సాంఘిక మార్పులకు పెద్దపీట వేస్తుంది. మానవాళి మనుగడతో బయటకు రాలేనంత లోతుగా పెనవేసుకున్న బంధం ఇది. ఎందుకంటే భావోద్వేగాలు (ఎమోషన్స్) ఇందులో అంతర్భాగమై ఉన్నయి కనుక. నాటకరంగం దీనికి పుట్టినిల్లు. కాలాంతర మార్పులకు నేడున్న స్థాయికి చేరింది. విలువలతో కూడిన సినిమాలు చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలవడమే కాకుండా, మన సంస్కృతీ-సంప్రదాయాలను, అలనాటి పరిస్థితులను తెలుసుకోవడానికి దోహదపడతాయి.
ఇది, ఒక కల్పిత కథకు ప్రతిరూపమని అందరికీ తెలుసు; వినోదాన్ని పంచడానికి ప్రయత్నిస్తుంది గాబట్టి, దీనిమీద అమితమైన ప్రేమను పెంచుకుని పోషిస్తున్నారు. పరిధి లేని ప్రతిభా పాటవాలాకు ఆలవాలమై, ఎంతోమంది కుటుంబాలు దీని నీడన జీవిస్తున్నాయి.
ఏ మార్పు సంభవించినా, ఆది మన ప్రవర్తన ద్వారానే సాధ్యమౌతుంది. మార్పు మంచిదైతే పురోగతికి, చెడ్డదైతే అధోగతికి దారితీస్తుంది. చెదరని ఎన్నో మధుర జ్ఞాపకాలను తనలో ఇముడ్చుకున్న ఈ పరిశ్రమ, నేడు తన అస్తిత్వం కోల్పోతున్నది. దీనికి స్వయంకృతమే కారణం. మార్పు అనేది అనివార్యమే ఐనా, ఎన్నటికీ విలువల వలువలూడదీయకూడదు. చిన్న ఉదాహరణ: గురువుని మించిన దైవం లేదు. ఈయన స్థానం ఎవరూ పూడ్చలేనిది. అత్యంత పుజ్యనీయమైన గురువుల పాత్రలను జోకర్లుగా హద్దుమీరి చూపిస్తున్నారు. కథ కల్పితమే కావచ్చు; కానీ నేటి యువతారానికి ఏం చూపిస్తున్నామో అన్నది చాలా ముఖ్యం. పాపమనే చెట్టును నీరు పోసి పోషిస్తే పుణ్యఫలాలను అందించగలుగుతుందా? చివరికి తన ఉనికికే ప్రశ్నార్ధకంగా మిగలవచ్చు.
కాలాన్ని చక్రంతో పోల్చారు పెద్దలు. కనుక ఆపాతమధురాలు మళ్లీ అందించగలుగుతామని ప్రేక్షకులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. నీ ద్వారా వచ్చే మార్పు యొక్క ప్రభావం సమాజంపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిని ఆదరించే మేము, పైరసీలకు అడ్డుకట్టవేసి, టిక్కెట్టు కొని థియేటరుకు వెళ్ళి ప్రేక్షకులుగా మయ వంతు సహాయ సహకారాలను అందిస్తాం. నీ ఉనికిని కాపాడతాం. "ధర్మో దక్షతి రక్షితః"
ఇట్లు
ఎస్. పి. సోమసుందర్
13-5-2015(2.23 పి.ఎమ్)
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







