బ్యాగేజీ నష్టానికి SR6568 వరకు పరిహారం
- August 24, 2023
జెడ్డా: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ప్రయాణికుల హక్కులను పరిరక్షించడానికి కొత్త కార్యనిర్వాహక నియంత్రణను ఆమోదించినట్లు ప్రకటించింది. ఇది నవంబర్ 20 నుండి అమలులోకి వస్తుంది. టిక్కెట్ విలువలో 150- 200 శాతం వరకు పరిహారం పొందేందుకు ప్రయాణీకుల హక్కుకు హామీ ఇచ్చే 30 నిబంధనలను కొత్త నియంత్రణలో చేర్చారు. షెడ్యూల్ కంటే ముందే విమానం బయలుదేరినప్పుడు లేదా బయలుదేరడంలో ఆలస్యం లేదా విమానాలను రద్దు చేసిన సందర్భంలో అలాగే ఓవర్‌బుకింగ్ మరియు డౌన్‌గ్రేడ్ కారణంగా విమానం ఎక్కేందుకు నిరాకరించిన సందర్భంలో పరిహారం ఇవ్వబడుతుంది. ఈ పరిహారాలలో కొన్ని టిక్కెట్ విలువలో 150 -200 శాతం వరకు ఉంటాయని పేర్కొన్నారు. కొత్త నిబంధన ప్రకారం.. ప్రయాణీకులు తమ లగేజీని పోగొట్టుకున్నప్పుడు SR6568కి సమానమైన ఆర్థిక పరిహారాన్ని అందించనున్నారు. బ్యాగేజీకి నష్టం, లోపం లేదా ఆలస్యమైన సందర్భంలో ప్రయాణీకుడు SR6568కి మించకుండా ఆర్థిక పరిహారాన్ని పొందేందుకు అర్హులు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







