రిలయన్స్ రిటైల్‌లో $1 బిలియన్ పెట్టుబడి పెట్టనున్న ఖతార్
- August 24, 2023
దోహా: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిలయన్స్ ఇండస్ట్రీస్) అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)లో రూ.8,278 కోట్ల (సుమారు $1 బిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA) ప్రకటించింది. QIA పెట్టుబడి RRVLలో 0.99% మైనారిటీ ఈక్విటీ వాటాగా మారుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన అనుబంధ సంస్థల ద్వారా భారత్ లో 18,500 స్టోర్‌లు, డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు కిరాణా, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & జీవనశైలి మరియు ఫార్మా సెంటర్లను నిర్వహిస్తుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో పెట్టుబడిదారుగా QIA చేరుతున్నందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌ను ప్రపంచ స్థాయి సంస్థగా మరింత అభివృద్ధి చేయడం ద్వారా భారతీయ రిటైల్ రంగాన్ని మార్చేందుకు.. QIA గ్లోబల్ అనుభవం నుండి ప్రయోజనం పొందాలని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. QIA సీఈఓ మన్సూర్ ఇబ్రహీం అల్-మహమూద్ మాట్లాడుతూ..భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లో ఒకటన్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ దాని బలమైన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో చేరడం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







