షార్జాలో పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం..!
- August 25, 2023
షార్జా: శుక్రవారం మధ్యాహ్నం షార్జాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. అల్ మజాజ్, అల్ తవున్, అబు షగరా, అల్ యార్మూక్ మరియు అల్ నహ్దా ప్రాంతాల్లో విద్యుత్ లేదని నివాసితులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. “మా ప్రాంతంలో 15 నిమిషాల పాటు విద్యుత్ లేదు,” అని అల్ మజాజ్‌లోని నివాసి ఎన్. మాలిక్ ట్వీట్ చేశారు. అల్ వాడా స్ట్రీట్‌లో నివసించే జమీర్ అవాన్ “నేను పని ముగించుకుని ఇంటికి చేరుకున్నప్పుడు, మా భవనంలో పవర్ లేకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను ఇతరులతో మాట్లాడిన.. వారు కూడా తమ ప్రాంతంలో విద్యుత్తు లేదని చెప్పారు.’’ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున ఇంట్లో ఉండలేకపోతున్నామని, మాల్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చాలా మంది నివాసితులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో కామెంట్స్ చేస్తున్నారు. అల్ మజాజ్ 3 నివాసి వాలిద్ ఖాన్ విద్యుత్ అంతరాయం కారణంగా శుక్రవారం ప్రార్థనల తర్వాత ఇంటికి తిరిగి రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. "నా రూమ్‌మేట్స్ నుండి నాకు చాలా కాల్స్ వచ్చాయి. కాబట్టి నేను అబ్దుల్ ఖాదిర్ అల్ బన్నా మసీదులో ఉండాలని నిర్ణయించుకున్నాను." అని అతను చెప్పాడు. ఖాసిమియా ప్రాంతంలో ఉంటున్న బుష్రా.. “నేను నా ఫ్లాట్‌కి వెళ్లాలంటే మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ, నేను కేవలం నాల్గవ అంతస్తులో ఉన్నాను.కానీ పై అంతస్తులలో నివసించే మరికొందరు మెట్లను ఎక్కలేక కిందనే వేచి ఉన్నారు.’’ అని తెలిపారు.
అల్ మజాజ్ 3, అల్ మజాజ్ 2 నివాసితులు తమ భవనాల్లో విద్యుత్ పునరుద్ధరించబడిందని నివేదించారు. మజాజ్ 3లోని సిటీ సెంటర్ భవనం నివాసి అతీక్ అహ్మద్ మాట్లాడుతూ..దాదాపు 45 నిమిషాల పాటు విద్యుత్ నిలిచిపోయిందని, మధ్యాహ్నం 2.05 గంటలకు తిరిగి వచ్చిందని చెప్పారు. కొంతమంది నివాసితులు కరెంటు పోయిన తర్వాత చాలా నిమిషాల పాటు లిఫ్ట్‌ల లోపల చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







