ఐఐటీ కి ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు శుభవార్త
- May 18, 2016
లక్షల రూపాయలు కుమ్మరించి ఐఐటీ కోచింగ్ లకు వెళ్లలేని పేద విద్యార్థులకు శుభవార్త. ఐఐటీకి ప్రిపేరయ్యే వారికోసం త్వరలోనే ఒక ఆప్, పోర్టల్ ను రూపొందించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఎడ్యుకేషన్ ప్రైవేటు సొసైటీ ఫర్ ఇండియా(ఈపీఎస్ఎఫ్ఐ) కార్యక్రమంలో పాల్గొన్న ఈ సమాచారం వెల్లడించారు. ఐఐటీ ఉపాధ్యాయుల పాఠాలు, గత పరీక్ష ప్రశ్నా పత్రాలను ఈ యాప్ లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష ప్రశ్నలను ఇంటర్ స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు. వ్యాపారంగా మారిపోయిన విద్యను పేద విద్యార్థులకు అందుబాటు లోకి తేవడమే తమ శాఖ ధ్యేయమని స్పష్టం చేశారు.
కోచింగ్ సంస్థలు విద్యార్థులకు కీడు చేస్తున్నాయని, వారిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో పోర్టల్, ఆప్ ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో 50 ఏళ్ల ఐఐటీ ప్రశ్నా పత్రాలను అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. వీటికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. 13 ప్రాంతీయ భాషల్లోనూ సమాచారం ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







