‘బేబీ’ సింగిల్ మూవీ వండర్‌గా మిగిలిపోవల్సిందేనా.?
- August 28, 2023
యూ ట్యూబ్ సెన్సేషనల్ అయిన వైష్ణవీ చైతన్య, ‘బేబీ’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాకే ఎక్కడ లేని పాపులారిటీ సంపాదించుకుంది.
రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి సూపర్ డూపర్ హిట్‌గా ‘బేబీ’ సినిమా నిలిచిన సంగతి తెలిసిందే. వైష్ణవీ చైతన్య నటనకు అంతా ఫిదా అయిపోయారు.
యూత్‌కి కావల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ పుష్కలంగా వుండడం కావచ్చు.. లేదంటే, వైష్ణవీ చైతన్య లక్కే కావచ్చు.. అనూహ్యంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఈ సినిమా తర్వాత వైష్ణవీకి అవకాశాలు పోటెత్తేస్తాయని భావించారంతా. అయితే, అలాంటిదేం లేదంటోంది వైష్ణవీ చైతన్య. ఇప్పటికే పూరీ జగన్నాధ్ సినిమాలో వైష్ణవి అవకాశం దక్కించుకుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయ్. తూచ్ అదంతా వుత్తదే అంటోంది వైష్ణవీ చైతన్య.
అయితే, మంచి కథల కోసం చర్చలు జరుగుతున్నాయట. కథలు వింటోందట. ఏది పడితే అవే చేసేయాలనుకోవడం లేదనీ, మంచి కథ దొరికితే ఓకే చేస్తానని చెబుతోంది వైష్ణవీ చైతన్య.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







