రామ్‌తో శ్రీలీల ఎప్పుడో నటించాల్సి వుందా.?

- August 28, 2023 , by Maagulf
రామ్‌తో శ్రీలీల ఎప్పుడో నటించాల్సి వుందా.?

రామ్‌తో నటించే ఛాన్స్ ఎప్పుడో వచ్చిందట శ్రీలీలకు. తన తొలి సినిమా ‘పెళ్లి సందడి’ ఫ్లాప్ అయినా, హీరోయిన్‌గా శ్రీలీల మాత్రం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

అప్పటి నుంచే ఈ అమ్మడిపై అందరికీ ఓ దృష్టి వుందనే చెప్పొచ్చు. అందం, అభినయం, ముఖ్యంగా డాన్సులు.. శ్రీలీల వైపు ప్రత్యేకంగా దృష్టి మళ్లేందుకు అవకాశంగా చెప్పొచ్చేమో.

ఆ నేపథ్యంలోనే రామ్‌తో గతంలోనే శ్రీలీలకు రెండు ఛాన్సులొచ్చాయట. అయితే, ఆ తర్వాత అవి ఎందుకో వర్కవుట్ కాలేదట. 

ఇక, ‘ధమాకా’ హిట్‌తో ఇప్పుడు మూడో ఛాన్స్‌గా ‘స్కంధ’ వర్కవుట్ అయ్యిందట. తాజాగా ఈ విషయాన్ని శ్రీలీల ప్రస్థావించింది. వెరీ రీసెంట్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణ ఈ ఈవెంట్‌కి గెస్ట్‌గా విచ్చేశారు. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయ్. ఈ సినిమాతో శ్రీలీల కెరీర్‌లో ఇంకో అడుగు ముందుకేయడం ఖాయమనిపిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com