మూడు మెడికల్ వేర్‌హౌస్‌లు సీజ్
- August 28, 2023
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు జెడ్డాలోని మూడు వైద్య సామాగ్రి, పరికరాల గోదాములను మూసివేసింది. ఈ గోదాముల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు అథారిటీ తెలిపింది. ఉల్లంఘనలలో లైసెన్స్ పొందకుండా 5,500 వైద్య ఉత్పత్తులను నిల్వ చేయడం ప్రధానమైనదని తెలిపారు. రెండు గిడ్డంగుల్లో అనుచితమైన పరిస్థితుల్లో నిల్వ చేసిన 300 గడువు ముగిసిన ఉత్పత్తులు, 3,500 వైద్య ఉత్పత్తులను తమ ఇన్‌స్పెక్టర్లు గుర్తించినట్లు SFDA పేర్కొంది. గోదాములను నిర్వహిస్తున్న వారిపై శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలంటూ అధికార యంత్రాంగం సమన్లు జారీ చేసింది. 1,700 వైద్య ఉత్పత్తులను లైసెన్సు పొందకుండానే ప్రమాదకరంగా గోదాములో నిల్వ చేసినట్లు గుర్తించారు. యూనిఫైడ్ నంబర్‌కు (19999) కాల్ చేయడం ద్వారా ఏదైనా సంస్థల ఉల్లంఘనల గురించి నివేదించాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







