'ఒక మనసు' ఆడియో విడుదల
- May 18, 2016
నాగశౌర్య, నిహారిక జంటగా నటించిన 'ఒక మనసు' ఆడియో ఫంక్షన్ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సందడిగా జరిగింది. రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సునీల్ కస్యప్ స్వరాలు సమకూర్చారు. ఈ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్ హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీలో ఈ రోజుకు ప్రత్యేకత ఉందన్నారు. తెలుగు అమ్మాయిలను సినీ పరిశ్రమకు తీసుకురావడమే కష్టతరమైన నేపథ్యంలో మెగా వారసురాలిగా నిహారిక సినీ రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. ఆమెను ప్రోత్సహించినందుకు గాను నాగబాబు దంపతులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం వరుణ్‌తేజ్ మాట్లాడుతూ.. నిహారిక చిన్నప్పుడు డాక్టర్ అవుతా.. ఐఏఎస్ అవుతనని చెప్పేదని.. చివరకు సినీరంగంలోకి అడుగుపెట్టడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మొదట కరెక్టు ప్లేస్ అనుకోలేదని.. తర్వాత తాను సంతోషించానన్నారు. నిహారికను స్ఫూర్తిగా తీసుకొని తెలుగు యువతులు చలనచిత్ర పరిశ్రమలోకి రావాలని కోరుకుంటున్నట్లు సినీ దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో నాగబాబు, రామ్‌చరణ్‌తేజ, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







