యూకే వెళ్లాల్సిన ప్రయాణికులందరికీ ముఖ్య గమనిక..
- August 28, 2023
లండన్: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కి వచ్చే విమానాలతో పాటు ఆ దేశం నుంచి వెళ్లే విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. గగనతల ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో యూకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్ పనిచేయడం లేదని అన్నారు. యూకేకు రావడానికి టికెట్లు బుక్ చేసుకుని ఇతర దేశాల్లో సిద్ధంగా ఉన్న వారికి విమాన సేవలు ఆలస్యంగా అందుతాయని చెప్పారు. ప్రయాణికుల రక్షణ కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. సాంకేతిక లోపాన్ని పరిష్కరించి, విమానాల రాకపోకలను పునరుద్ధరించడానికి ఇంజనీర్లు పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. తమ సేవల తాజా సమాచారం కోసం తమ వెబ్ సైట్ చూడాలని ప్రయాణికులకు విమానయాన సంస్థ లోగానయిర్ సూచించింది. అధికారులతో తాము చర్చిస్తున్నామని ఈజీజెట్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







