జవాన్ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్ చేసిన షారుఖ్ ఖాన్..
- August 28, 2023తమిళ్ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘జవాన్’. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నారు. ఇక ప్రియమణి, సన్య, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తుంటే దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరవబోతుంది. దాదాపు మూవీ పనులన్నీ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మూవీలోని సాంగ్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.
అలాగే మూవీ నుంచి ‘ప్రివ్యూ’ అంటూ ఒక ట్రైలర్ కట్ ని మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రివ్యూ వీడియో మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. అయితే పిక్చర్ అప్పుడే అయ్యిపోలేదు, మరో ట్రైలర్ కట్ బాకీ ఉందట. ఈ ట్రైలర్ ని పవర్‌ఫుల్ యాక్షన్ కట్ తో రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ ని ‘రాఖీ’ కానుకగా ఆగష్టు 31న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, బాలీవుడ్ లో మాత్రం గట్టిగా వినిపిస్తుంది.
కాగా ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ప్రివ్యూలో బోడి గుండు గెటప్ లో కనిపించి అందర్నీ షాక్ చేశాడు. ఈ సినిమా కథ నచ్చడంతో తానే నిర్మాతగా వ్యవహరిస్తూ.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. అయితే మూవీ టీం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము