పాఠశాలలు, క్యాంపస్‌లో సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై నిషేధం

- August 30, 2023 , by Maagulf
పాఠశాలలు, క్యాంపస్‌లో సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై నిషేధం

యూఏఈ: దుబాయ్‌లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాఠశాల అవరణలో సోషల్ మీడియా అప్లికేషన్‌లను ఉపయోగించడంపై పాక్షిక లేదా పూర్తి నిషేధాన్ని విధించాయి. అయితే, సోషల్ మీడియా విద్యార్థుల జీవితాల్లో ఒక భాగంగా కొనసాగుతుందని ప్రధానోపాధ్యాయులు అంగీకరిస్తున్నప్పటికీ, అలాంటి ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేయడం వల్ల పాఠశాల నిబంధనలను ప్రమాదకర ఉల్లంఘనగా పరిగణించడం జరుగుతుందన్నారు. GEMS ఇంటర్నేషనల్ స్కూల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గదీర్ అబు-షమత్ మాట్లాడుతూ.. “పాఠశాలలో విద్యార్థులు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకూడదు. పాఠశాల సమయంలో సోషల్ మీడియా నిషేధించబడింది. ” అన్నారాయన.

కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తమ సోషల్ మీడియా ఛానెల్‌లలో పాఠశాల నుండి చిత్రాలను పోస్ట్ చేయవలసి వస్తే అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.పాఠశాల సమావేశాలలో మరియు వర్క్‌షాప్‌ల ద్వారా సామాజిక మాధ్యమాల వినియోగంపై నిరంతరం అవగాహన కల్పిస్తామని, మార్గదర్శకాలను అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com