బాలకృష్ణ వందవ చిత్రంలో రానా
- May 18, 2016
టాలీవుడ్ యంగ్ జనరేషన్ లో విలక్షణ పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.., ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా హీరోగానే కాక విలన్ గానూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా సత్తా చాటిన రానా, ఆ తరువాత కూడా మరిన్ని విలక్షణ పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు భారీ చిత్రాల్లో రాయల్ లుక్ లో కనిపించిన రానా, ఇప్పుడు మరోసినిమాలో రాజు గెటప్ లో కనిపించనున్నాడు.నందమూరి బాలకృష్ణ వందవ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రంలో రానా కూడా నటిస్తున్నాడట. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో రెండు సార్లు రాజు పాత్రలో కనిపించిన రానా గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం మరోసారి అదే తరహా పాత్రలో నటించనున్నాడు. గతంలో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణంవందే జగద్గురుమ్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఆ నమ్మకంతోనే మరోసారి క్రిష్ తో కలిసి పనిచేయడానికి అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







