ముంబైలో ప్రారంభమైన ఇండియా మూడవ మీటింగ్
- August 31, 2023
ముంబై: ఇండియా కూటమికి కన్వీనర్‌గా నితీశ్ కుమార్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు, రేపు విపక్షాల మూడవ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ఇండియా కన్వీనర్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నితీశ్ కు ఐదు పార్టీల నేతల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 11 మందితో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఐదుగురి మద్దతు ఉన్నందున నితీశ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబైలో సాగుతోన్న విపక్షాల సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి సమావేశం బిహార్ రాజధాని పాట్నాలో జరగ్గా, రెండవ సమావేశంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







