చిరంజీవితో ఆ సిరీస్‌ని సినిమాగా చేయాలనుకున్నారా.?
- August 31, 2023
‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ సెకండ్ సీజన్‌లో సమంత లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. పలు వివాదాల నడుమ ఆ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది.
అయితే అందకు ముందే ఆ సిరీస్‌ని సినిమాగా తీయాలనుకున్నారట. అది కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా. అశ్వనీదత్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చారనీ ఇన్‌సైడ్ సోర్స్ టాక్.
సబ్జెక్ట్ ఓకే కానీ, ఈ సబ్జెక్ట్‌లో నటించేందుకు చిరంజీవి అంగీకారం తెలపలేదనీ తెలుస్తోంది. వెబ్ సిరీస్ కనుక దీనికి సంబంధించి కొన్ని వైల్డ్ అండ్ బోల్డ్ సన్నివేశాలు చెల్లిపోయాయ్.
కానీ, సినిమాకి వచ్చేసరికి, అది కూడా చిరంజీవి సినిమా అంటే చాలా లెక్కలుంటాయ్. ఈక్వేషన్లు మారిపోతాయ్. సో, ఇవన్నీ ఆలోచించే చరంజీవి ఈ సబ్జెక్ట్ వదులుకుని వుండుండొచ్చు.
ఇలా చిరంజీవి వదులుకున్న సబ్జెక్టుల్లో చాలా సబ్జెక్టులు సూపర్ హిట్ అయ్యాయ్. రజనీకాంత్ ‘భాషా’ ఆ కోవలోకి చెందిందే. అలాగే పలు మార్లు వదులుకున్న సబ్జెక్టులు బిగ్ డిజాస్టర్లుగానూ మిగిలిన సందర్భాలున్నాయ్. అఫ్‌కోర్స్ చిరంజీవికే కాదు. చాలా మంది నటీనటుల విషయంలో ఇలా జరగడం సహజమే మరి.!
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







