అయ్యో పాపం.! ‘లైగర్’ బ్యూటీ పరిస్థితి.!
- August 31, 2023
‘లైగర్’ సినిమాతో అనన్యా పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే, ఆ సినిమా రిజల్ట్ సంగతి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి ఈ సినిమాలో అనన్యా పాండే చాలా చక్కగా నటించింది తనకిచ్చిన పాత్ర పరిధి వరకూ.
సినిమా హిట్ అయితే, టాలీవుడ్‌లో నిలదొక్కుకోగల స్టామినా వున్న నటే. కానీ, సీన్ రివర్స్ అయిపోయింది. మరిన్ని తెలుగు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ అనన్యకున్నప్పటికీ తెలుగు మేకర్లు వద్దు బాబోయ్ అనన్యా.! అంటున్నారట.
అవును మరి, టాలీవుడ్‌లో సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఏమాత్రం సెంటిమెంట్ వర్కవుట్ అయినా ఇంక అంతే సంగతి. అందుకే ఆమెను వద్దంటున్నారట.
కానీ, అనన్యకు తెలుగు సినిమాల్లో నటించాలన్న కోరిక మాత్రం అలాగే వుండిపోయిందట. మరో మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నా అంటోంది. మంచి సబ్జెక్ట్, ఛాన్స్ దొరికితే, మళ్లీ తెలుగు ప్రేక్షకుల్లో తానేంటో ప్రూవ్ చేసుకుంటానంటోంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







