శరీరానికి ప్రొటీన్లు ఎందుకు అవసరం.?

- August 31, 2023 , by Maagulf
శరీరానికి ప్రొటీన్లు ఎందుకు అవసరం.?

ప్రొటీన్లు కేవలం మాంసాహారంలోనే వుంటాయా.? ఖచ్చితంగా కాదు. శాఖాహారంలో కూడా ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఆహారపదార్ధాలున్నాయ్. ముఖ్యంగా ఆకుకూరల్లో ప్రొటీన్లు అధికంగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు. సోయా, చిరు ధాన్యాలు, గుమ్మడి కాయ, కాయ ధాన్యాలు తదితర వెజ్ ఐటెమ్స్‌లో ప్రొటీన్లు అధికంగా లభిస్తాయట. పప్పు ధాన్యాల్లోనూ ప్రొటీన్లు అధికంగా లభిస్తాయ్.
మాంసాహారం అలవాటు లేని వాళ్లు ఈ ఆహార పదార్ధాలు తమ ఆహారంలో ఖచ్చితంగా వుండేలా చూసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 
ప్రొటీన్లు శరీరంలోని కండరాల కణజాలాన్ని ధృడంగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయ్. అలాగే జీర్ణక్రియ వ్యవస్థను మెరుగు పరుస్తాయ్. తరచూ ఇన్షెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయ్. అందుకే ప్రొటీన్లు మనం తీసుకునే ఆహారంలో అధిక పరిమాణంలోనే వుండాలని డైటీషియన్లు చెబుతున్నారు. 
ప్రొటీన్లు సరిపడినంత అందకపోతే తరచూ అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే వీలైనన్ని ప్రొటీన్ కలిగి వున్న ఆహార పదార్ధాలను మెనూలో చేర్చుకుంటే మంచిది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com