సింగపూర్ లో తెలుగు సంస్థలచే జస్టిస్ ఎన్వి రమణకు ఘన సత్కారం

- September 01, 2023 , by Maagulf
సింగపూర్ లో తెలుగు సంస్థలచే జస్టిస్ ఎన్వి రమణకు ఘన సత్కారం

సింగపూర్: సింగపూర్ లో, భారత పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ 'సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్' యొక్క ప్యానల్ సభ్యునిగా బాధ్యతలు అందుకున్న సందర్భంగా, సింగపూర్ లోని ప్రధాన తెలుగు సంస్థలైన శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ మొదలైన సంస్థల ప్రతినిధులు వారిని గౌరవ పూర్వకంగా కలిసి తమ సంస్థల తరఫున అభినందనలు తెలియ జేసి సత్కరించారు. 

“తెలుగు వారికే గర్వకారణమైన జస్టిస్ ఎన్వి రమణను, వారి సింగపూరు పర్యటన సందర్భంగా కలుసుకోవడం, వారికి తమ సంస్థ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అన్నింటిని తెలియపరచి వారి ఆశీస్సులు అభినందనలు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని" 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. 

జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ "తెలుగు  వారంతా ఒక్కటిగా, ఒకే  మాట మీద, ఒకే  తాటి  మీద  ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం  కూడా గుర్తించి మీరంతా ఎన్నో సంవత్సరాల  నుంచి  కోరుకుంటున్న విధంగా   తెలుగు భాషను  సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో  బోధించడం  సులభతరం  అవుతుందని, ఆ ప్రక్రియలో తమ సహాయ  సహకారాలు  కూడా ఎప్పుడూ ఉంటాయని" అన్నారు.

ఈ సందర్భంగా సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి తదితరులు జస్టిస్ రమణని కలిసి సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com