టీటీడీ సీనియర్ అడ్వకేట్ చిత్తర్వు రఘుకు ఘన సన్మానం
- September 04, 2023
మచిలీపట్నం: మచిలీపట్నంకు చెందిన సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘును తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ న్యాయవాదిగా నియమించిన సందర్భంగా సోమవారం మచిలీపట్నంలో న్యాయవాదులు లంకిశెట్టి సర్కిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా న్యాయవాది సీనియర్ రఘు మాట్లాడుతూ...ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు కలిగిన తిరుపతి దేవస్థానంకు తనను సీనియర్ న్యాయవాదిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఏ విధమైన ఫీజు లేకుండా కేసులు వాదించడానికి ముందుకు వచ్చినట్లు తెలియజేశారు.తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడడానికి భక్తులు మనోభావాలు కాపాడడానికి న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకున్న తీసుకుంటామని తెలియజేశారు.మచిలీపట్నం లా కాలేజీలో చదివి ఈ రోజు తిరుపతి దేవస్థానానికి సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా రఘు అన్నారు.ఈ సందర్భంగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ చిత్తర్వు రఘు టిటిడి సీనియర్ అడ్వకేట్ గా నియమించటం మచిలీపట్నానికి గర్వకారణం అని అన్నారు.1987-90 సంవత్సరంలో మచిలీపట్నం లా కాలేజీలో చదువుకున్న రఘు రాష్ట్ర హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పనిచేయడం తిరుపతి దేవస్థానానికి సేవ చేసే భాగ్యం దొరకటం అదృష్టమని అన్నారు. మచిలీపట్నం చెందిన చిత్తర్వు సూర్యనారాయణ కుమారుడిగా రఘు మచిలీపట్నం ప్రజలకు చిర పరిచితుడని అన్నారు. మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడపా మురళి మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడటంలో రఘు సేవలు మరింత అవసరమని అన్నారు. భగవంతుని ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి టీటీడీ దేవస్థానం నియమించటం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కోన రమణారావు, గరిమెళ్ళ ప్రభాకర్ రావు, కమ్మిలి విజయకుమార్, జీ.దన వెంకట నారాయణ, అధ్యాపకులు లంకి శెట్టి హరినాథ్ బాబు,సురేష్, 15వ వార్డు మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







