ట్రయాథ్లాన్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకోల్పిన దుబాయ్ తోబుట్టువులు
- September 09, 2023
యూఏఈ: టీమ్ఏంజెల్వోల్ఫ్లో దుబాయ్ కుటుంబానికి చెందిన తోబుట్టువులు టియా, రియో కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి ‘మరొక వ్యక్తిని మోసుకెళ్లి ఒలింపిక్ దూర ట్రయాథ్లాన్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసిన’ రికార్డును నమోదు చేశారు. 20 ఏళ్ల రియో దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి అయితే, ఈ మల్టీస్పోర్ట్ రేస్‌లో తన సోదరుడిని తీసుకెళ్లిన అతని 16 ఏళ్ల సోదరి టియా పాల్గొన్నారు. రియోను కయాక్లో లాగుతూ 1.5 కిలోమీటర్లు ఈత కొట్టడం, రియోను ముందు కూర్చోబెట్టి ప్రత్యేకంగా రూపొందించిన బైక్‌పై 50 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం, చివరికి రియోను రన్నింగ్ చైర్లో నెట్టుకుంటూ 10 కిలోమీటర్లు పరిగెత్తడం ద్వారా టియా రేసును ముగించి రికార్డు సృష్టించింది. 3 గంటల, 39 నిమిషాలు మరియు 37 సెకన్లలో రేసును పూర్తి చేసారు. అంతకుముందు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ థ్రెషోల్డ్ 3 గంటల 45 నిమిషాలుగా ఉంది. కాగా, దుబాయ్‌లో మార్చి నెలలో జరిగిన ట్రయాథ్లాన్లో వారు పాల్గొని ఈ ఫీట్ సాధించారు. తాజాగా ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







