కింగ్‌తో కిరికిరికి సిద్ధమైన అల్లరోడు.!
- September 09, 2023
అక్కినేని నాగార్జున ఇటీవలే తన కొత్త సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో సహా ఫస్ట్ లుక్‌కి సంబంధించిన చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
కంప్లీట్ మాస్ గెటప్‌లో నాగార్జున కనిపిస్తున్న ఈ సినిమాకి ‘నా సామిరంగా..’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు కూడా. టైటిల్ చాలా క్యాచీగా వుంది. బిగ్‌బాస్ రియాల్టీ షో ఓపెనింగ్ ఎపిసోడ్లో ఈ టైటిల్‌ని బాగా ప్రమోట్ చేసుకున్నాడు కంటెస్టెంట్స్ ద్వారా నాగార్జున.
కాగా, ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు ఇండస్ర్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడన్నదే ఆ అప్టేడ్ సారాంశం.
తాను చేయబోయే ప్రాజెక్టులను సైతం పక్కన పెట్టేసి అల్లరోడు ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడట. త్వరలోనే నాగార్జున, అల్లరి నరేష్ కాంబినేషన్ సీన్లు చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట.
కొరియెగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!