ముంబైలో కూలిన లిఫ్ట్…ఏడుగురి మృతి
- September 11, 2023
ముంబై: మహారాష్ట్రలో లిఫ్ట్ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. థానే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలిపోవడంతో కనీసం ఏడుగురు కార్మికులు మరణించారు. కార్మికులు టెర్రస్‌పై నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. భవనం టెర్రస్‌పై వాటర్ఫ్రూఫింగ్ పనులు ముగించుకుని 40 అంతస్తుల నిర్మాణం నుంచి కార్మికులు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
నిర్మాణ లిఫ్ట్‌లోని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి పగిలిందని,దీనివల్ల ఈ ఘటన జరిగిందని థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధిసతి యాసిన్ తాడ్వి తెలిపారు. ఇది నిర్మాణ లిఫ్ట్ అని, ఇది సాధారణ ఎలివేటర్ కాదని పోలీసులు చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్థానిక అగ్నిమాపక శాఖ, పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ప్రస్తుతం లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







