శ్రీలీల అలా చేస్తోందా.?
- September 13, 2023
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన శ్రీలీల చేతిలో అరడజను కొద్దీ సినిమాలున్నాయ్ ప్రస్తుతం. అయితే, వాటిన్నింటినీ హ్యాండిల్ చేయలేకపోతోందట ఒంటి చేత్తో శ్రీలీల.
వీటితో పాటూ, మరిన్ని కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చేస్తున్నాయట. అలాగే, ఇంకో పక్క శ్రీలీల స్టడీస్ కంప్లీట్ చేసుకునే పనిలోనూ బిజీగా వుంది.
ఓ పక్క షూటింగులకు హాజరవుతూనే ఖాళీ టైమ్ దొరికితే, మరో పక్క స్టడీస్‌కి ప్రిపేర్ అవుతోందట శ్రీలీల. ఇదంతా ఇలా వుంటే, కొత్త ప్రాజెక్టుల విషయంలో శ్రీలీలపై ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే, కొత్త ప్రాజెక్టుల్ని శ్రీలీల లైట్ తీసుకుంటోందట. ఈ మధ్య ఒకట్రెండు పెద్ద ప్రాజెక్టులే వదిలేసుకోవల్సి వచ్చిందట. అందుకూ కారణం లేకపోలేదు.
సినిమాలు అనుకున్న టైమ్‌కి షెడ్యూల్స్ కంప్లీట్ కావడం లేదు. అందుకు సవాలక్ష కారణాలు. రకరకాల ప్రతికూల పరిస్థితులు షూటింగ్ షెడ్యూల్స్‌కి అడ్డం తగులుతున్నాయ్.
ఆ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందట శ్రీలీల. అందుకే రీసెంట్గా కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు శ్రీలీల కావాలనే వదిలేసుకుందట అని ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







