నితిన్ ‘ఎక్స్‌ట్రా’లు ఎంతవరకూ వచ్చాయట.!
- September 13, 2023
‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’ అనే సినిమాలో నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ మధ్య రిలీజై సెన్సేషన్ అయ్యింది.
ఈ పోస్టర్‌లో నితిన్ లుక్సే అంత సెన్సేషన్ అయ్యేందుకు కారణం. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోకి వీరాభిమానిగా నితిన్ కనిపించబోతున్నాడన్న ప్రచారం వుంది..!
అలాగే, రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో నితిన్ కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా, ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి అనుకున్నదాని కన్నా బడ్జెట్ ఎక్కువయిపోతోందంటూ ఆ గాసిప్ సారాంశం.
ప్రస్తుతం నితిన్ మార్కెట్ ఏమంత బాగా లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. దాంతో, బడ్జెట్ ఎక్కువ పెట్టేస్తే తదుపరి పరిణామాలెలా వుంటాయన్న అంశంపై నిర్మాతలతో పాటూ, నితిన్ కూడా తర్జన భర్జన పడుతున్నారట. చూడాలి మరి. ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







