నిద్రలేమికి జాజికాయ మంచి ఔషధం తెలుసా.?

- September 13, 2023 , by Maagulf
నిద్రలేమికి జాజికాయ మంచి ఔషధం తెలుసా.?

జాజికాయ అంటే గుర్తొచ్చేది ఘుమఘుమలాడే బిర్యానీ. అవును నిజమే..! బిర్యానీలో వాడే మసాలాల్లో జాజికాయ ఒకటి. అయితే,జాజికాయను కేవలం బిరియానీలో మాత్రమే కాదండోయ్.. రకరకాల డెజర్ట్‌లు, సూప్స్ , కొన్న రకాల వెజ్ కూరల్లోనూ విరివిగా వాడుతుంటారు.

కేవలం టేస్ట్ కోసమే జాజికాయను వాడుతుంటారనుకుంటే పొరపాటే. జాజికాయను చాలా కాలంగా ఆయుర్వేద మెడిసెన్‌లో వాడుతున్నారు.

జాజికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు తొలగించుకోవడానికి జాజికాయను వినియోగించవచ్చట. 

దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటూ, విటమిన్ ఏ, బి, సి.. వంటి ఖనిజాలు పుష్కలంగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా నిద్రలేమిని పోగొట్టడంలో జాజి కాయ పాత్ర అత్యంత కీలకంగా చెబుతున్నారు. ఆయుర్వేదంలో నిద్రలేమికి సంబంధించి తయారు చేసే మందుల్లో జాజికాయను కీలకంగా వాడతారట.

నిద్రలేమికి చాలా మంది రకరకాల పిల్స్ తీసుకుంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముంది. కానీ, రాత్రి పూట గ్లాసుడు పాలల్లో చిటికెడు జాజికాయ పొడి వేసుకుని తాగితే నిద్రలేమికి చెక్ పెట్టొచ్చన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆరోగ్యానికి ఎంతమాత్రమూ హానికరం కాని ప్రక్రియ ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com