రెండు ట్రక్కుల ఢీ: షార్జాలో డ్రైవర్ మృతి
- May 20, 2016
రెండు ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో ఈజిప్టియన్ డ్రైవర్ ఒకరు మృతి చెందారు. అల్ ధాయిడ్ మసాఫి రోడ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుందని షార్జా పోలీసులు వెల్లడించారు. సార్జా సెంట్రల్ రీజియన్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ బిన్ దార్విష్ మాట్లాడుతూ, యాక్సిడెంట్ గురించిన సమాచారం రాగానే వెంటనే అక్కడికి తమ బృందం చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసిందన్నారు. ప్రమాదం తర్వాత రెండు వాహనాలకూ మంటలు అంటుకున్నాయనీ, వాటిని ఆర్పివేయగలిగామన్నారు. 31 ఏళ్ళ వయస్సున్న ఓ డ్రైవర్ ఘటన వఆస్థలంలోనే చనిపోగా, మరో ట్రక్ డ్రైవర్ గాయాల పాలయ్యాడనీ, అతన్ని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు. రోడ్డుపై సరైన వేగం పాటించడం, ఓ వాహనానికీ ఇంకో వాహనానికీ మధ్య దూరాన్ని మెయిన్‌టెయిన్ చెయ్యడం, రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం ప్రమాదానికి కారణమని కల్నల్ బిన్ దార్విష్ చెప్పారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







