‘చంద్రముఖి 2’.! అంత సేపు భరించగలమా.!
- September 15, 2023
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో 17 ఏళ్ల క్రితం వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ప్రముఖ డాన్స్ కొరియెగ్రాఫర్, నటుడు, నిర్మాత, డైరెక్టర్ అయిన లారెన్స్ రాఘవ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది.
కాగా, ఇటీవల వచ్చిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయ్. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్సే ఈ సినిమాకి ప్రాణం. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు చిత్ర నిర్మాతలు.
తాజాగా ఈ సినిమా రన్ టైమ్ లాక్ చేశారు. 170 నిముషాల (2.50 గంటలు) రన్ టైమ్‌తో సినిమా ఎండ్ అవ్వనుందట. అంటే దాదాపు మూడు గంటల సమయమే. మరి అంత సేపు ఆడియన్స్‌ని ధియేటర్లో లాక్ చేసి వుంచగలిగే కంటెంట్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూపించగలరా.? అంటే సెప్టెంబర్ 28 వరకూ ఆగాల్సిందే. అదే రోజు ‘చంద్రముఖి 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







