మొన్న నాని కోసం ‘లీల’గా ఇప్పుడు సూర్య కోసం విలన్‌గా.!
- September 15, 2023
‘అంటే సుందరానికి’ సినిమాతో సెన్సేషనల్ అయిపోయిన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ ఇప్పుడు కొత్త అవతారమెత్తబోతోందట. తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య సినిమాలో విలనిజం చూపించేందుకు సిద్ధమవుతోందట.
‘కంగువ’ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో ప్రస్తుతం సూర్య నటిస్తున్నారు. ఈ సినిమాని ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఈ సినిమాలో మరో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడనీ సమాచారం.
అయితే, లేడీ విలన్ రోల్ ఈ సినిమాలో ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఆ రోల్ కోసం నజ్రియా ఫహాద్‌తో సంప్రదింపులు చేస్తున్నారనీ ప్రచారం జరుగుతోంది.
ఆమె కూడా ఈ విభిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్ధంగా వుందనీ కోలీవుడ్ సమాచారం. ఒకవేళ అదే నిజమైతే మళ్లీ నజ్రియా పేరు మార్మోగిపోవడం ఖాయం. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎందుకో మరి, నజ్రియాకి ఎక్కడ లేని క్రేజ్.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







