ఉసిరితో నేచురల్ హెయిర్ డై సాధ్యమేనా.!
- September 15, 2023
ఉసిరితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. అయితే, ముఖ్యంగా అందమైన జుట్టు కోసం ఉసిరిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవన శైలిలో భాగంగా.. తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు.
దీనికోసం తాత్కాలిక హెయిర్ డైల వెంట పరుగులు తీస్తున్నారు. వాటి వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నారు. అలా కాకుండా నాలుగే నాలుగు ఉసిరి కాయలతో ఆరోగ్యకరమైన హెయిర్ డైని తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నాలుగు ఉసిరి కాయల్ని తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, అందులో కొద్దిగా నేచురల్ హెన్నా పౌడర్, టీ పొడి డికాషన్ కలిపి రెండు నుంచి నాలుగు గంటలు నానబెట్టి వుంచాలి.
ఆ తర్వాత హెయిర్‌కి పట్టించి గంట తర్వాత కడిగేస్తే నిగ నిగలాడే జుట్టు మీ సొంతమవుతుంది. అలాగే తెల్ల జుట్టు సమస్య కూడా నివారించబడుతుంది.
కుదుళ్ల నుంచీ ఈ మిశ్రమం ఎఫెక్టివ్‌గా పని చేయడం వల్ల తెల్ల జుట్టు మళ్లీ మళ్లీ రాకుండా వుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. అందానికి అందం.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్‌ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు
- బీచ్‌లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి