మతిమరుపుకు మందేయండిలా.!
- September 19, 2023
వయసుతో పాటూ కాస్త చాదస్తం కూడా పెరుగుతుంటుంది. అలాగే పెరుగుతున్న వయసులో భాగంగా ఎక్కువగా ఎదుర్కొనే సమస్య.. మతిమరుఫు సమస్య. ఈ సమస్యకు మందుందా.? లేదా.? అనే సంగతి అటుంచితే.! పాలకూరను ఎక్కువగా తినే వారిలో మతి మరుపు సమస్య చాలా అరుదుగా వస్తుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
పాలకూర లేదా స్పినాచ్ అధికంగా తీసుకునే వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా వుంటుంది. ఈ ఆకుకూరలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటూ పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లుంటాయ్.
అవి శరీరానికి అత్యంత విలువైన శక్తినివ్వడమే కాకుండా, బ్రెయిన్ షార్ప్‌గా పని చేసేలా చేస్తాయట. అలాగే, బ్రెయిన్ క్యాన్సర్ తదితర సమస్యలు భవిష్యత్తులో దరి చేరనీయకుండా చేస్తాయట. మెదడు సక్రమంగా పని చేస్తే మతి మరుపు సమస్య వచ్చే అవకాశమే లేదుగా.!
అలా మెదడు ఆరోగ్యంలో అత్యంత కీలకంగా పని చేస్తుంది పాలకూర. అందుకే ఈ ఆకుకూరని తప్పకుండా మెనూలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వారంలో కనీసం మూడు, నాలుగు సార్లు పాలకూరను వివిధ రకాలుగా తీసుకోవడం వుత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్‌ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి