అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారా.? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేసి చూడండి.!
- September 20, 2023
చాలా మందిలో అజీర్తి సమస్యలు సర్వ సాధారణం. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, లేట్ నైట్ నాన్‌వెజ్ ఐటెమ్స్ గట్టిగా లాగించేయడం.. ఇలా వేర్వేరు సందర్భాల్లో అజీర్తి సమస్యలు వేధిస్తుంటాయ్.
మరి వీటిని తాత్కాలికంగా తగ్గించేసుకోవడం కోసం.. ఈనో తదితర ప్రత్యామ్నాయాల్ని వినియోగిస్తుంటాం. అప్పటికప్పుడు ఉపశమనం కలిగించినప్పటికీ ఇవి దీర్ఘ కాలం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయ్.
అందుకే ఈ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కొన్ని ఇంటి చిట్కాలు బాగా ఉపకరిస్తాయ్. అందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ జీలకర్ర.
జీలకర్రను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతీ రోజూ పరగడుపున తాగితే, ఎటువంటి అజీర్తి సమస్యలూ దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. ఈ జీలకర్ర కషాయం ఏ వయసులో వారైనా నిరభ్యంతరంగా తాగొచ్చు. అజీర్తి సమస్యలతో పాటూ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తీరిపోతాయ్.
జీలకర్ర ప్లేస్‌లో వామును కూడా వినియోగించవచ్చు. అల్లం రసం కూడా మంచి ఫలితం ఇస్తుంది. అలాగే ఇంగువాను నీటిలో కలిపి తీసుకున్నా ఆయా జీర్ణ సమస్యలు సులువుగా తగ్గించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి