నకిలీ నోట్లను చెలామణి.. ఆసియా వ్యక్తికి జైలుశిక్ష
- September 21, 2023
బహ్రెయిన్: SR500 విలువైన నకిలీ సౌదీ రియాల్ నోట్లను చెలామణి చేసినందుకు దోషిగా తేలిన ఒక ఆసియా వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. అలాగే బహ్రెయిన్ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. 2023లో బహ్రెయిన్లోకి నకిలీ కరెన్సీని తీసుకొచ్చి రెండు వాణిజ్య దుకాణాల్లో లావాదేవీలకు వినియోగించినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఒక సూపర్ మార్కెట్లోని ఒక ఉద్యోగి అనుమానితుడు SR500 చెల్లించి BD3.5 విలువైన బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు నివేదించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ కరెన్సీ నకిలీదని సదరు ఉద్యోగి గుర్తించారు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







