విమానంలో లవ్ నోట్ వ్యవహారం.. వ్యక్తికి జైలుశిక్ష, బహిష్కరణ
- September 21, 2023
బహ్రెయిన్: మరో గల్ఫ్ దేశం నుండి బహ్రెయిన్‌కు వెళ్లే విమానంలో ఒక యువతితో పరిచయం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించిన ఒక ఆసియా వ్యక్తి ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అతను తన ఫోన్ నంబర్, ఆమెతో కమ్యూనికేట్ చేయాలనే కోరికను వ్యక్తం చేస్తూ సందేశాన్ని తెలిపేలా ఒక నోట్ ని పంపాడు. అయితే, విమానం దిగగానే బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసును విచారించిన దిగువ క్రిమినల్ కోర్టు తీర్పును ధృవీకరిస్తూ బహ్రెయిన్ కాసేషన్ కోర్టు తుది తీర్పును వెలువరించింది. నిందితుడికి ఒక నెల జైలు శిక్ష, దేశం నుండి శాశ్వత బహిష్కరణ విధించింది. బహిరంగ ప్రదేశంలో బాలిక గౌరవానికి భంగం కలిగించే చర్యకు పాల్పడ్డారని, నైతిక అవినీతికి పాల్పడినట్లుగా కూడా నిందితుడిపై అభియోగాలు మోపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







