శర్వానంద్ సినిమాలో కృతి శెట్టి.!
- September 21, 2023
కృతి శెట్టి పనైపోయిందనుకున్న టైమ్‌లో నాగ చైతన్య సరసన ‘కస్టడీ’ సినిమా ఛాన్స్ వచ్చింది. అయితే, బ్యాడ్ లక్.! అది కూడా కృతి శెట్టికి కలిసి రాలేదు. దాంతో, కృతి శెట్టి కెరీర్ కంప్లీట్ ఖతమ్ అనుకున్నారంతా.
అయితే, ఇంకా వుంది.! కృతి శెట్టికి ఇంకో ఛాన్స్ వచ్చింది. ఈ సారి శర్వానంద్ సరసన కృతి శెట్టి ఛాన్స్ కొట్టేసింది. శర్వానంద్ 35వ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇంతవరకూ ఖరారు కాలేదు.
తాజాగా కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఫిక్స్ చేశారు. అధికారికంగా కృతి శెట్టి పేరును ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాతోనైనా కృతి శెట్టి బౌన్స్ బ్యాక్ అవుతుందా.? చూడాలి మరి. అన్నట్లు శర్వానంద్ పెళ్లి తర్వాత చేస్తున్న సినిమా ఇది. ‘ఒకే ఒక జీవితం’ సినిమా తర్వాత శర్వా నంద్ నుంచి ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు.
కృతి శెట్టితో తొలిసారి శర్వానంద్ జత కడుతోన్న సినిమా ఇది. చూడాలి మరి, ఇద్దరికీ ఎలాంటి లక్కు తీసుకురానుందో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







