శృతి హాసన్ వాట్ నెక్స్‌ట్.!
- September 21, 2023
‘గబ్బర్ సింగ్’ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది శృతి హాసన్. ఆ తర్వాత మళ్లీ ‘కాటమరాయుడు’ సినిమాతో ఆమె గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. అలా పూర్తిగా గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్‌లోనే ప్రేమ, పెళ్లి.. అంటూ కాస్త డ్రామా నడిపించింది. కానీ వర్కవుట్ కాలేదు. కెరీర్ దెబ్బ తినేసింది.
‘క్రాక్’ సినిమాతో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చిన శృతి హాసన్, గతేడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య సరసన బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాల్లో నటించి సెన్సేషన్ సృష్టించింది.
అయితే, ఇది కూడా పెద్దగా వర్కవుట్ అయ్యింది లేదు పాపం శృతి హాసన్ కి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘సలార్’ మూవీ వుంది. ఇదో ప్రెస్టీజియస్ మూవీ. ప్యాన్ ఇండియా మూవీ కూడా.
అలాగే ప్రబాస్ సినిమా అంటే.. మార్కెటింగ్.. పబ్లిసిటీ ఏ రేంజ్‌లో వుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బహుశా శృతి హాసన్‌కి ఈ సినిమాతోనే ఎంతో కొంత కలిసి రావాలి. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చింది.? స్టేటస్ ఏంటనేది తెలియ రావడం లేదు. ఏది ఏమైతేనేం, శృతి హాసన్‌కి ‘సలార్’ ఓ మంచి కమ్ బ్యాక్ అవుతుందని ఆశిద్దాం.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







