ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా
- September 21, 2023
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును హైకోర్టు ఈనెల 26 కి వాయిదా వేసింది. హైబ్రిడ్ విధానంలో ఈ కేసు విచారణకు హైకోర్టు అంగీకరించింది. దీంతో బెయిల్ వస్తుందని ఆశించిన చంద్రబాబుకు నేడు నిరాశే మిగిలింది. ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా టిడిపి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు.
ఇందులో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి ఆరోపిస్తోంది. చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్, పొంగూరు నారాయణ కలిసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారని అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై పిటి వారెంట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగగా ఈ కేసుని హైకోర్టు ఈనెల 26 వాయిదా వేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







