రెజీనా మనసు మార్చుకుందా.?
- September 21, 2023
సినిమాల్లో లాభం లేదంటూ ఓటీటీ బాట పట్టింది ఇటీవల అందాల భామ రెజీనా. ఓటీటలో పాత్రకు ప్రాధాన్యత వున్న కంటెంట్స్ సెలెక్స్ చేసుకుంటూ తనదైన గుర్తింపు దక్కించుకుంది.
ఓటీటీలో రెజీనాని చూసిన బాలీవుడ్ మేకర్లు కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చారు రెజీనాకి. అందులో భాగంగానే ‘సెక్షన్ 108’ అనే సినిమాలో నటిస్తోంది.
అదలా వుంటే, తాజాగా ఓ హారర్ మూవీలో రెజీనా ఛాన్స్ దక్కించుకుంది. తెలుగుతో పాటూ పలు ఇతర భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కబోతోంది.
సెల్విన్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ఇంతవరకూ ఎప్పుడూ తెరపై చూడని హారర్ కథాంశాల్ని చిత్రీకరించబోతున్నారట.
హాలీవుడ్ రేంజ్లో మేకింగ్ వుండబోతోందనీ అంటున్నారు. ఏరి కోరి ఈ సినిమా కోసం రెజీనాని ఎంచుకోవడం విశేషం. గ్లామర్ తారగా పేరు తెచ్చుకున్న రెజీనా.. ఓటీటీ పుణ్యమా అని యాక్షన్ గాళ్‌గా మారిపోయింది.
తాజా సినిమాతో వెండితెరపై మరోసారి కొత్తగా సరికొత్తగా వెలుగులు విరజిమ్మేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







