త్రివిక్రమ్ - మహేష్ కంప్లీట్ యాక్షన్ మోడ్.!

- September 21, 2023 , by Maagulf
త్రివిక్రమ్ - మహేష్ కంప్లీట్ యాక్షన్ మోడ్.!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. వాయిదాల పర్వం ముగించుకుని ఇటీవలే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా.

ఈ సినిమా వచ్చేదా.? అన్న వాళ్లందరి నోళ్లూ మూయించేశారు ఇటీవల ఓ ప్రెస్ మీట్ ద్వారా మహేష్ బాబు. సంక్రాంతికి ఖచ్చితంగా ‘గుంటూరు కారం’ రావడం పక్కా.. అని అభిమానులకు మాటిచ్చారాయన.

ఇక, ప్రస్తుతం షూట్‌లో భాగంగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారట. సినిమాకి ఈ యాక్షన్ బ్లాక్ అత్యంత కీలకం.. తెరపై అద్భుతం కానుందనీ తెలుస్తోంది. 

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ భారీ యాక్షన్ బ్లాక్ చిత్రీకరణ జరుగుతోందట. అవుట్ పుట్ అదిరిపోయేలా వస్తోందట. 

థమన్ అందిస్తున్న ఆర్ఆర్ ఈ యాక్షన్ బ్లాక్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లబోతోందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని హారిక, హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com