బెల్లం టీతో బెల్లీ ఫ్యాట్‌కి చెక్.!
- September 21, 2023
పంచదారతో పోల్చితే బెల్లం వాడకం ఆరోగ్యానికి మంచిదని పెద్దవాళ్లు చెబుతుంటారు. అవును నిజమే, బెల్లంలో ఐరన్ పుష్కలంగా లభించడంతో పాటూ, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి బెల్లం చాలా ఉపయోగకరం అని అంటున్నారు. డైలీ టీ తాగే అలవాటుంటుంది చాలా మందిలో.
టీలో చక్కెరకు బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా బెల్లం టీ తాగేవారిలో పొట్ట చుట్టూ వున్న కొవ్వు కరిగిపోతుందట. అదే బెల్లీ ఫ్యాట్.
అలాగే మరో ముఖ్యమైన అంశం.. మైగ్రేన్ సమస్యకు ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోతే.. బెల్లం టీతో చెక్ పెట్టేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మైగ్రేన్ సమస్య వున్ వాళ్లు చక్కెర జోలికి అస్సలు పోరాదని కూడా హెచ్చరిస్తున్నారు. ఆవు పాలలో బెల్లం కలిపి టీ చేసుకుంటే ఇంకా మంచిదట. ఎర్రరక్తకణాల వృద్ధి పెరుగుతుంది.
అయితే ఏదైనా మితంగానే తీసుకోవాలి. రోజులో రెండు సార్లు బెల్లం టీ తాగితే ఫర్వాలేదు. అంతకన్నా ఎక్కువ అయితే, అంత మంచిది కాదు సుమా.!
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి