అక్టోబర్ 1 నుంచి భారత్‌కు సర్వీసులు బంద్: సలామ్‌ఎయిర్
- September 21, 2023
మస్కట్: అక్టోబర్ 1 నుంచి భారత్‌కు కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు సలామ్ ఎయిర్ ప్రకటించింది. దీంతో భారతదేశానికి వెళ్లే వందలాది మంది ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు గందరగోళంలో పడ్డాయి. ప్రయాణికులు బుక్ చేసుకున్న టిక్కెట్ల కోసం వారి రీఫండ్‌ను పొందుతారని ఈమెయిల్ లో సలామ్ ఎయిర్ ప్రకటించింది. సలామ్‌ఎయిర్ అనేది సుల్తానేట్ ఆఫ్ ఒమన్ నుండి తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థ. ప్రస్తుతం భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాలకు ఇది సేవలు అందిస్తుంది. ఉత్తర భారతదేశంలోని జైపూర్, లక్నో, దక్షిణ భారతదేశంలోని కాలికట్, తిరువనంతపురంకు సర్వీసులను నడుపుతోంది. ఒమన్‌లోని వేలాది మంది ప్రవాసులకు ఇది చౌకగా ప్రయాణ సదుపాయాలను కల్పిస్తుంది. భారతదేశానికి అన్ని కార్యకలాపాలను సలామ్‌ఎయిర్ నిలిపివేసినట్లు తమకు కూడా సమాచారం వచ్చిందని ట్రావెల్ ఏజెన్సీలు ధృవీకరించాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







