సెప్టెంబర్ లోనే 75 శాతం మంది ఉద్యోగాలు ఎందుకు మారుతారు?

- September 21, 2023 , by Maagulf
సెప్టెంబర్ లోనే 75 శాతం మంది ఉద్యోగాలు ఎందుకు మారుతారు?

యూఏఈ:  చాలా మంది యూఏఈ నివాసితులకు సెప్టెంబర్ నెలను రెండవ నూతన సంవత్సరంగా పిలుస్తారు. ఎందుకంటే వారు కొత్త ప్రారంభం..  మెరుగైన అవకాశాల కోసం ఈ సమయంలో కొత్త ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. ప్రముఖ ప్రాపర్టీ, రిక్రూట్ మెంట్ కంపెనీ  Allsopp & Allsopp ప్రకారం.. పిల్లలు పాఠశాలకు తిరిగి వెళ్ళే సమయానికి కొత్త ఉద్యోగాలను వెతకడం ప్రారంభిస్తారు. దీంతో తమ కెరీర్‌లో ఎదగాలని చూస్తున్న వ్యక్తులు కొత్త అవకాశాల కోసం ప్రాధాన్యత ఇస్తారు.  సుమారు 71 నుండి 75% మంది వరకు ఉద్యోగాలు మారుతున్నారు.  Allsopp గ్రూప్‌లోని ప్రిన్సిపల్ కన్సల్టెంట్ బాబీ ధాలివాల్ ప్రకారం.. రియల్ ఎస్టేట్, ఆటోమోటివ్, కార్పొరేట్ సేవలతో సహా కీలక పరిశ్రమలలో 75% మంది నిపుణులు సెప్టెంబర్ నాటికి ఉద్యోగాలను మార్చడానికి సిద్ధమవుతున్నారు. సగటు జీతాలు దాదాపు 10-12% పెరుగుతాయి.   సౌదీ అరేబియా వంటి ఇతర ప్రాంతాలతో పోలిస్తే, 66% నివాసితులు ఉద్యోగ స్విచ్‌ని ఎంచుకున్నారు. యూఏఈ జనాభాలో 71% నుండి 75% మంది మార్పును కోరుకుంటున్నారు.  దుబాయ్ గ్లోబల్ బిజినెస్ హబ్‌గా అభివృద్ధి చెందాక ఏటా దాదాపు 30,000 నుండి 60,000 కొత్త వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో జాబ్ మార్కెట్ కూడా విస్తరిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com