ఎక్కువ సేపు ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేస్తున్నారా.?

- September 22, 2023 , by Maagulf
ఎక్కువ సేపు ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేస్తున్నారా.?

ఏసీ (ఎయిర్ కండిషనర్) అనేది నేటి జీవన శైలిలో సర్వ సాధారణంగా మారిపోయింది. అవును నిజమే.. ఏసీ వేసుకుంటే శరీరానికి చల్లగా వుంటుంది. కానీ, ఎక్కువ సేపు ఏసీ రూమ్‌లో వుండడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయనీ తాజా సర్వేలో వెల్లడైంది.
సహజ సిద్ధంగా అనిపించే ఆ అనారోగ్య సమస్యల్ని తట్టుకునే శక్తి గతంలో వుండేది. కానీ, ఎయిర్ కండిషనర్లకు అలవాటు పడ్డాకా, ఆ శక్తి క్రమ క్రమంగా సన్నగిల్లిందని నిపుణుల సర్వేలో తేలింది.
ముఖ్యంగా కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్ ఎక్కువైపోయాయ్. వాటికి కారణం ఎయిర్ కండిషనర్లే అంటున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఎక్కువ సేపు ఏసీలో వుండకూదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే ఏసీలో ఎక్కువగా వుండడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతున్నాయట. నోరు ఎండుకుపోయి, అధిక దాహం వేధించే అవకాశాలున్నట్లు నిపుణుల సర్వేలో తేలింది.
చర్మం పొడిబారడంతో పాటూ, అనేక రకాల చర్మ సమస్యలు ఏసీలతో వస్తున్నాయట. అంతేకాదు, కొందరిలో తీవ్రమైన తలనొప్పి, నడుంనొప్పి వంటి సమస్యలు కూడా వేధిస్తున్నాయని తెలిసింది. వీటన్నింటకీ ఏసీలు అధికంగా వినియోగించడమే కారణంగా తేల్చారు. సో, వీలైనంత తక్కువగా ఏసీలకు దూరంగా వుంటే మంచిదని నిపుణుల సలహా.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com