బ్రేక్ తీసుకుని తప్పు చేశావయ్యా వేణు.!
- September 22, 2023
వేణు తొట్టెంపూడికి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు కామెడీ హీరోగా ఈయన చాలా ఫేమస్. మినిమమ్ గ్యారంటీ సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు వేణు.
అయితే, చాలా కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నాడు. విదేశాల్లో సెటిలైపోయాడు. ఇటీవలే ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో వేణు పాత్ర గురించి అబ్బో.! తెగ మాట్లాడారు రిలీజ్‌కి ముందు. కానీ, రిలీజ్ తర్వాత అంత సీను లేదని తేల్చేశారు ప్రేక్షకులు.
దాంతో, వేణు మళ్లీ సైడ్ అయిపోయాడు. లేటెస్ట్‌గా ఓటీటీలో ‘అతిధి’ అనే వెబ్ సిరీస్‌తో వేణు పేరు మళ్లీ వినిపిస్తోంది. కాస్త గట్టిగానే వినిపిస్తోందీసారి. దాంతో, మళ్లీ హీరోగా ట్రై చేస్తున్నాడట.
హీరో అవకాశాలయితేనే సినిమాలు చేస్తానంటున్నాడట. కానీ, ఆ దిశగా అంత పాజిటివ్ సైన్స్ లేవనీ తెలుస్తోంది. సినిమాలకు దూరం కాకుండా కంటిన్యూ చేసి వుంటే ఏమైనా ఛాన్స్ వుండేదేమో అల్లరి నరేష్‌లా వేణుకి కూడా. ఇదిలా వుంటే, వచ్చే ఎన్నికల్లో వేణు యాక్టివ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్న ప్రచారం మరోవైపు వినిపిస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







