‘లియో’ సినిమాకి ఏంటీ డిజిటల్ తలనొప్పి.!
- September 23, 2023
ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళంతో పాటూ, తెలుగు, హిందీ, కన్నడ తదితర భాషల్లో విడుదల కానుంది.
అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి డిజిటల్ తలనొప్పి వచ్చి పడిందట. తెలుగు, తమిళ భాషల్లో ఎలాంటి సమస్య లేదు కానీ, హిందీ వెర్షన్‌కొచ్చేసరికి ధియేటర్లో విడుదలైన రెండు నెలల లోపు ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు హిందీ సినిమాలు.
కానీ, ‘లియో’ని కేవలం నెల రోజుల లోపే రిలీజ్ చేస్తామని ఓటీటీ పాట్నర్స్ పట్టుబడుతున్నారట. హిందీ సినిమాలకో నియమం.. సౌత్ సినిమాలకో నియమమా.? ఇదేం లెక్క.! రెండు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ వారిస్తోందట.
కానీ, డిజిటల్ పాట్నర్స్ అందుకు ఒప్పుకోవడం లేదనీ తెలుస్తోంది. దాంతో, హిందీ వెర్షన్ ‘లియో’ నిర్మాతలకు కాస్త తలనొప్పిగానే తయారైంది.
హిందీ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించడం సినిమాకి అదనపు ఆకర్షణ. అన్నట్లు ఈ నెలాఖరుకు చెన్నైలో ‘లియో’ ఆడియో ఫంక్షన్‌ని అత్యంత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







