చిరు - వశిష్ట సినిమాలో హీరోయిన్లు.! ఒకరు కాదు నలుగురైదుగురు.!
- September 23, 2023
‘భోళా శంకర్’ సినిమా తర్వాత చిరంజీవి నుంచి ఏ సినిమా రాబోతోందా.? అని ఆరా తీస్తే.. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట సినిమా ముందు సోదిలోకి వచ్చింది. అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కేందుకు గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసుకుంటోంది.
కాగా, ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్లు వుండరనీ, కంప్లీట్ ఫాంటసీ నేపథ్యంలో సినిమా వుండబోతోందనీ ప్రచారం జరుగుతోంది. అయితే, ఫాంటసీ మాట వాస్తవమే. కానీ, హీరోయిన్లు లేకపోవడమన్నదాంట్లో వాస్తవం లేదు.
ఈ సినిమాలో ఒకరికి మించి ముగ్గురు, ఆ పై నలుగురైదుగురు వరకూ హీరోయిన్లు వుంటారట. అయితే, హీరోతో రొమాన్స్.. డ్యూయెట్లు వేసుకోవడం వుండదట. అలా వచ్చి వెళ్లిపోతుంటారట.
తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ కూడా చూచాయగా స్పష్టత ఇచ్చారు. అంతేకాదు, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఈ సినిమా విజువల్ వండర్‌గా వుండబోతోందనీ ఆయన తెలిపారు.
ఆల్రెడీ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై ఒకింత ఆసక్తి క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







